వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు ముహుర్తాన్ని కూడా సుబ్బారెడ్డి ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉదయం 9.30కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఏర్పాట్లు కౌంటింగ్ తర్వాత ప్రారంభిస్తారా లేకపోతే తర్వాత చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
వైసీపీ నేతలు తాము గెలవబోతున్నామని చెప్పుకోవడానికి చాలా డెస్పరేట్ గా ఉన్నారు. ఫేక్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ను ప్రచారం చేసుకుంటూ… పార్టీ క్యాడర్ లో గాలి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఇంకా నమ్మించేందుకు ఓ రోజు గెలుస్తామని మరో రోజు… సీట్లు వస్తాయని.. మరోసారి ప్రమణస్వీకారం తేదీని.. మరో రోజు ముహుర్తాన్ని ప్రకటిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరు భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఆజ్ఞాతంలో ఉండటానికి ఏది మంచి ప్లేసో వెదుక్కుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
మాములుగా అయితే జగన్ ప్రమాణ స్వీకార ముహుర్తాన్ని స్వరూపానంద ఖరారు చేస్తారు. ఆయనను సంప్రదించి వైవీ సుబ్బారెడ్డి ముహుర్తాన్ని ఖరారు చేశారో.. టీటీడీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో ఆయనే పెట్టేశారో స్పష్టత లేదు. కానీ అదేమీ రియల్ కాదని.. ఏదో చెప్పాలని చెప్పారని వైసీపీ క్యాడర్ కూడా అర్థమవుతూనే ఉంది. వైసీపీ నేతల ఓవరాక్షన్ చూసి.. వారి క్యాడర్ లోనే మరింత అనుమానాలు పెరుగుతున్నాయి.