కార్తికేయ నటించిన సినిమా ‘భజే వాయు వేగం’. ఈనెల 31న విడుదల అవుతోంది. ఈమధ్య చిన్న, ఓ మోస్తరు సినిమాలకు ఓటీటీ రేట్లు రావడం లేదు. దాంతో నిర్మాతలు బెంగ పెట్టుకొన్నారు. అయితే ‘భజే వాయు వేగం’ భలేగా సేఫ్ అయిపోయింది. ఈ సినిమాని ఇదివరకెప్పుడో నెట్ ఫ్లిక్స్‌కు రూ.10 కోట్లకు అమ్మేశారు. శాటిలైట్ హక్కులు జీ దగ్గర ఉన్నాయి. ఆ రూపంలో నిర్మాతలకు మరో రూ.5 కోట్ల వరకూ వచ్చాయి. అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.15 కోట్లు ముట్టాయన్నమాట. ఇది నిజంగా మంచి డీల్.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. యూవీ బ్యాండ్ వాల్యూ నాన్ థియేట్రికల్ రైట్స్ కు బాగా ప్లస్ అయ్యింది. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’తో పాటుగా ‘భజే వాయు వేగం’ని ఒకేసారి అమ్మేయడం వల్ల ప్లస్ అయ్యింది. పెద్ద సంస్థల దగ్గర ఉండే వెసులుబాటే అది. అన్ని సినిమాల్నీ కలిపి గంపగుత్తగా అమ్మేస్తారు. దాంతో కొన్ని సినిమాలు విడుదలకు ముందే గట్టెక్కేస్తుంటాయి. ఆ లిస్టులో ‘భజే..’ కూడా చేరిపోయింది. ఇటీవల టీజర్ విడుదలైంది. టైటిల్ కు తగ్గట్టుగా టీజర్ మంచి స్పీడుగా సాగిపోయింది. ఒకట్రెండు రోజుల్లో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.