పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని, జనసేన కార్యకర్తలను సైతం పట్టించుకోరని వైసీపీ చేసిన ప్రచారానికి గట్టి సమాధానం ఇచ్చారు జనసేనాని.
జనసేన కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసిన వెంటనే పవన్ స్పందించారు. మృతుడి కుటుంబానికి అండగా నిలవాలని స్థానిక నేతలను అలర్ట్ చేశారు. తక్షణ సాయంగా లక్ష రూపాయలను ప్రకటించిన పవన్ కార్యకర్త కుటుంబానికి పూర్తిస్థాయిలో భరోసానివ్వాలని సూచించారు. అవసరమైతే తాను కూడా వస్తానని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు పవన్.
దీంతో పవన్ ను నాన్ లోకల్ అంటూ వైసీపీ విమర్శలు చేసినా తాజాగా ఆయన స్పందించిన విధానం చెంపపెట్టులాంటిదంటున్నారు జనసైనికులు. మరోవైపు, గెలుపోటములకు సంబంధం లేకుండా ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఆయన వేగంగా స్పందించిన తీరు వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది.