తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా మరో బిగ్ బాంబ్ పేల్చారు. ఆర్ ట్యాక్స్ కు జతగా మరో ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారన్నారు. యూ ట్యాక్స్ పేరిట 950కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
యూ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్లు కేసీ వేణుగోపాల్ కు ఇచ్చారని…ఇది వాస్తవం కాదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు తనకన్నా ముందుకు వెళ్తున్నారని, తను వెనకబడిపోతున్నాననే భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారని విమర్శించారు.
రైస్ మిల్లర్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని, 450 కోట్లు ఆయనకు చెల్లించారన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ స్కామ్ 950కోట్లు అని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు ఎవరికి వారుగా టోల్ గేట్లను ఏర్పాటు చేశారని, త్వరలోనే మిగతా శాఖల బండారం కూడా బయటపెడుతానని స్పష్టం చేశారు.
అయితే, మహేశ్వర్ రెడ్డి యూ ట్యాక్స్ అని చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపడంతో మంత్రి ఉత్తమ్ స్పందించారు. పాపులారిటీ కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని,యూ ట్యాక్స్ అనేది పచ్చి అబద్దమన్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో లేనని , వచ్చాక సమాధానం చెబుతానని తెలిపారు.