ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం సాయంత్రంకల్లా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈవీఎంలను ధ్వంసం చేయడంపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లి అరెస్ట్ కు డెడ్ లైన్ విధించింది. దీంతో పిన్నెల్లి అరెస్ట్ జరిగితే వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
పోలింగ్ ముగిసిన నాటి నుంచి మీడియా ముంగిటకు వస్తోన్న వైసీపీ నేతలు టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారని, వైసీపీకి వ్యతిరేకంగా ఈసీ కూడా వ్యవహరించిందని ఆరోపణలు చేయడం రోజూవారీ దినచర్యగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా తేలడం.. మాచర్లలో అల్లర్లు జరగడం…ఆయనపై కేసు నమోదు కాకపోవడంతో ఎవరు ఎవరికి సహకరించారు అనే విషయంలో స్పష్టత వచ్చినట్లు అయింది.
ఇందుకు సంబంధించిన వ్యవహారంలో పిన్నెల్లిను అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ పట్ల వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు బిగ్ డిస్కషన్ గా మారింది. తాము శాంతియుతంగా, పారదర్శకంగా పోలింగ్ జరగాలని కోరుకున్నామని కానీ, పలుచోట్ల టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఏకంగా ఈవీఎంలనే ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పనిసరి కావడంతో ఈ అరెస్ట్ ను వైసీపీ ఖండిస్తుందా..? సమర్దిస్తుందా..? అనేది ఆసక్తి గొల్పుతోంది.