”కమల్ సర్, అమితాబ్ సర్ తో పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేసినందుకు కమల్ సర్ కి, అమితాబ్ సర్ వెయ్యి దండాలు” అన్నారు ప్రభాస్. కల్కి మ్యాసీవ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్స్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో బైక్ కార్ స్టంట్స్ అబ్బురపరిచాయి. ఈ వేడుకలోనే బుజ్జి పాత్రని పరిచయం చేశారు.
ఈ వేడుకులో ప్రభాస్ మాట్లాడుతూ.. కమల్ హసన్, అమితాబ్ గారిని చూసి దేశం మొత్తం స్ఫూర్తి పొందింది. అలాంటి వారిద్దరితో పని చేసే అవకాశం వచ్చింది. నేను చాలా లక్కీ. మా ఇంట్లో అందరూ అమితాబ్ ఫ్యాన్స్. సాగరసంగం చూసి కమల్ హాసన్ లాంటి బట్టలు వేసుకున్నాను. ఆయనా డ్యాన్స్ చేయాలని అనుకునేవాణ్ని. దత్తుగారి పాషన్ కి హ్యాట్సప్. ఆయనకి డబ్బుపొతుందని భయం లేదు. వాళ్ళ అమ్మాయిలకి కూడా అదే పాషన్ వచ్చింది. నాగికి థాంక్స్. థియేటర్స్ లో కలుద్దాం” అన్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.