హైదరాబాద్… ఫేమస్ రెస్టారెంట్లకు పెట్టింది పేరు. నగరంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఫుడ్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే వీకెండ్ పేరుతో, పార్టీ పేరుతో రెస్టారెంట్లలో తినేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెస్టారెంట్లు కూడా వెరైటీ వంటకాల పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఎలాగూ కస్టమర్లు కిచెన్ లోకి రారు కాబట్టి… ఎలా చేసినా, ఎలాంటి పదార్థాలు వాడినా ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదనే ధీమాతో రెస్టారెంట్లు కలుషిత ఆహారాన్ని సర్వ్ చేస్తున్నాయి.
తాజాగా సోమాజిగూడలోని కృతుంగ – పాలెగార్స్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో లేని పన్నీర్ ,మేతి మలైను గుర్తించిన అధికారులు వాటిని అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేశారు. వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని టీడీఎస్ వాల్యూ సరిగ్గా ఉందో తెలుసుకునేందుకు ల్యాబారేటరీకి పంపించారు. వంటగది పూర్తిగా అపరిశుభ్రంగా కనిపించడం పట్ల రెస్టారెంట్ యాజమన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో సోమాజిగూడలో కేఎఫ్సీ, రెస్ట్ ఒబార్ రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన సందర్భంలో సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికెట్ డిస్ప్లే చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
అలాగే, రెస్ట్ ఓ బార్లో ఎక్స్ఫైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండటం, తిను పదార్థాలను తయారు చేయడంలో సిబ్బంది సరైన ప్రమాణాలను పాటించకపోవడం గుర్తించిన అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.
నోరూరించే వాసనలు, వేడివేడి వడ్డన ఉంటుందని ఫేమస్ రెస్టారెంట్లకు వెళ్తే అనారోగ్యం ఖాయం. పేరు గొప్ప , ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైన ఈ రెస్టారెంట్లలో ఆహరం తింటే.. లక్షలు పోసి ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు రెడీగా ఉండాల్సిందే. హైదరాబాదీలారా… బీ అలర్ట్..
https://x.com/cfs_telangana/status/1793331162057982011?t=Y7uKdBW0vdQPQcnXr8XlgQ&s=09