ఒకే ఒక్క ఫోటో .. అదీ కూడా వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి షేర్ చేసిన ఫోటో వైసీపీ నేతలు, కార్యకర్తల ధైర్యాన్ని పూర్తిగా దిగజారుస్తోంది. ఇక ఆశల్లేవా అనే పరిస్థితి వస్తోంది. సుమ తియ్యగూర అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కొన్ని ఫోటోలు షేర్ చేసి.. ఇవన్నీ సత్తెనపల్లిలోని ఓ బూత్ లో టీడీపీ కార్యకర్తలు పగులగొట్టారని ఆ వీడియో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సుమ తియ్యగూర జడ్జిలను దూషించిన కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఆమె ట్విట్టర్లో పెట్టిన ఫోటోల్లో వీవీ ప్యాట్ మెషిన్ కూడా పగిలిపోయి ఉంది. అందులో ఉన్న ఓటింగ్ స్లిప్‌లు బయపడ్డాయి. ఆ ఓటింగ్ స్లిప్‌ను చూస్తే… ఫ్యాన్ గుర్తులే కనిపించడం లేదు. పాతిక సైకిల్ గుర్తులు కనిపిస్తే ఐదో ఆరో ఓట్లు వైసీపీకి పడినట్లుగా ఉన్నాయి. ట్రెండ్ ఇంత భారీగా తేడాగా ఉండటంతో వైసీపీ నేతలకూ మింగుడు పడటం లేదు.
వైసీపీకి బలమైన విలేజ్‌లో .. టీడీపీ వారు ధ్వంసం చేశారని.. అక్కడి ఫుటేజీ కావాలని సోషల్ మీడియాలో అడుగుతూంటే..అదే విలేజ్ లో టీడీపీకి అంత భారీ తేడాతో ఓట్లు ఉండటం అంటే చిన్న విషయం కాదు. వైసీపీ ఓటర్లు కూడా అదీ గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో టీడీపీ వైపు మొగ్గారని ఈ ఫోటో నిరూపిస్తోంది. వైసీపీ నేతలే తమ దీన స్థితిని ఇలా బయటపెట్టుకోవడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్న సెటైర్లు పడుతున్నాయి.