బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను కాపాడేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయా..? హేమను అరెస్ట్ చేయవద్దని, విచారణ చేసి వదిలేయాలని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న అధికారులకు ఏపీ నేతల నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయా..?అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నటి హేమను ఈ ఇష్యూలో సేఫ్ జోన్ లో ఉంచేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. హేమ డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో సోమవారం విచారణకు హాజరు కావాలని ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో హేమను అరెస్ట్ చేస్తారనుకున్నారేమో కానీ , ఈ కేసును దర్యాప్తు చేస్తోన్నసీసీబీ పోలీసులకు ఏపీ నేతల నుంచి కాల్స్ వెళ్లాయని కన్నడ మీడియా అంటోంది. అంతేకాకుండా తమపై ఒత్తిడి కూడా ఉందని పోలీసు అధికారి పేర్కొనటం ఇందుకు బలం చేకూర్చుతోంది.
రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేయవద్దని, ఆమెను విచారణ చేసి వదిలేయాలని బెంగళూరు సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది. అయితే, హేమను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతోన్న ఆ ఏపీ లీడర్లు ఎవరు..? ఎందుకు వారు హేమను సేఫ్ చేయాలని చూస్తున్నారు అనేది తేలాల్సి ఉంది.