సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మరికొద్ది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? స్తబ్దుగా ఉన్న ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తాజా కదలిక దేనికి సంకేతం..? రాధాకిషన్ వాంగ్మూలంతో పోలీసులు గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇవ్వబోతున్నారా..?
ఇప్పుడిదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో బిగ్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్దాయన కనుసన్నలోనే జరిగిందని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ లో కవితను సేఫ్ చేయలనుకున్నట్లు మాజీ డీసీపీ రాధాకిషన్ చెప్పడం రాజకీయాలను కుదిపేస్తోంది. తమ సొంత నిర్ణయాలు ఏమి లేవని, అంతా పెద్దాయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ తంతు కొనసాగినట్లుగా ఎకవాక్యంలో అంతా బయట పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు విచారణ చేపడుతోన్న పోలీసులు ఇప్పుడు ఏం చేయనున్నారు..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్ ను తలిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎస్ఐబీ అధికారులను అరెస్ట్ చేయగా… విచారణలో వారు గత ప్రభుత్వంలో కీలక నేతల పేర్లు బయటపెట్టినా ఇంతవరకూ నోటీసులు ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసు పొలిటికల్ గా డైవర్ట్ అవుతుందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాధాకిషన్ రావ్ కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో కీలక విషయాలు వెలుగులోకి రావడం, పెద్దాయన ఆర్డర్స్ తోనే అంతా జరిగిందని చెప్పడంతోపాటు ఓ మాజీ మంత్రి పేరు కూడా బయటపెట్టడంతో గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికలు కూడా ముగిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి చంచల్ గూడ జైల్లో చిప్పకూడు తినిపిస్తానని వ్యాఖ్యానించిన రేవంత్.. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలొద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు రావడంతో త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు.