ఏపీలో రిజల్ట్ డే దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. కూటమికి వైసీపీకి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో గెలుపెవరిదో తేలిపోనుంది. అయితే, ఏ విషయంలోనూ అలసత్వం లేకుండా ఇరు వర్గాలు రెడీ అవుతుండగా, ఓటమి తప్పదన్న భావనలోకి వైసీపీ నేతలు వెళ్లిపోతున్నారు.
ఇప్పటికే ఏయే వర్గాలు ఎవరికి అండగా ఉన్నాయన్న అంశంపై ఓ అవగాహనకు వస్తుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మనకు పడలేదన్న క్లారిటీకి వైసీపీ వచ్చినట్లు కనపడుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా ఉద్యోగులే ఉన్నారు. వైసీపీ సర్కార్ పరిపాలన, ఉద్యోగులను వేధించిన సంఘటనలపై ఉద్యోగులు పోరాటాలు కూడా చేశారు. అయితే, ఈ ఓట్లు ఎలాగైనా చీలిపోవాలన్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ… రూల్స్ వెతికే పనిలో పడింది.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో కొన్ని చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు తమ సీల్ వేయలేదు. దీంతో అవి చెల్లుతాయా లేదా అన్న గందరగోళం ఉండగా, అవి చెల్లుబాటు అవుతాయని ఈసీ స్పష్టత ఇచ్చింది. అవి ఎవరికి పడతాయో ఎవరికీ తెలియదు. కానీ సీల్ లేదన్న కారణంగా ఓట్లు మురిగిపోకూడదన్న ఉద్దేశంతో ఈసీ నిర్ణయం తీసుకుంది.
కానీ, అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు… ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ వైసీపీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించటం చూస్తుంటే వారికి ఎలాగు పడలేదు కాబట్టి కూటమికి ఓట్లు దక్కకూడదన్న ఉద్దేశమే అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.