ఇండియన్ క్రికెట్ అంటేనే సెలబ్రిటీ స్టేటస్. డబ్బుకు డబ్బు. క్రికెటర్లకే కాదు హెడ్ కోచ్ సహా సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ భారీగానే ఆఫర్లుంటాయి. కానీ, కొంతకాలంగా రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ ఎవరు అన్న దానికి బీసీసీఐకి సరైన ఆప్షన్ దొరకట్లేదు.
అవును… రాహుల్ ద్రావిడ్ రిటైర్ కాబోతున్నారు. రెన్యూవల్ చేస్తాం అని బీసీసీఐ సంప్రదిస్తే నో చెప్పాడట. దీంతో గంభీర్ పేరు బలంగా వినిపించినా, ఇండియన్ టీం కోచ్ గా చేస్తున్న వారు ఎవరైనా సరే ఐపీఎల్ కు దూరంగా ఉండాల్సిందే. దీంతో, గంభీర్ కూడా కోల్ కతా టీంతోనే కంటిన్యూ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ దశలో ఆస్ట్రేలియన్ ఆటగాడు రికీ పాంటింగ్, లాంగర్ వంటి పేర్లు తెరపైకి వచ్చినా ముందుకు సాగటం లేదు.
ఓ దశలో బీసీసీఐ స్వయంగా వీ.వీ ఎస్ లక్ష్మణ్ ను సంప్రదించినా లక్ష్మణ్ కూడా నో చెప్పారు. సంవత్సరంలో దాదాపు 10నెలల పాటు జట్టుతోనే ట్రావెల్ చేయాల్సి ఉండటం, పర్సనల్ లైఫ్ తో పాటు షార్ట్ టైంలో డబ్బులొచ్చే ఐపీఎల్ దూరంగా ఉండాల్సి వస్తుండటమే కోచ్ గా చేయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
ఈ దశలో ఇప్పుడున్న క్రికెటర్ల ఆరాధ్య దైవంగా ఉన్న ధోనీ ఎందుకు కోచ్ కాకుడదు? ఎంతో నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ ఉండే ధోనీ అయితే ఇండియన్ క్రికెట్ ఇంకా ముందుకు వెళ్తుంది అని చర్చ ప్రారంభమైంది. అయితే, ధోనీకి కోచ్ గా ఛాన్స్ లేదని బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అంతర్జాతీయంగా ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ, ఐపీఎల్ లో కొనసాగుతున్నందున… బీసీసీఐ నియమావళి ప్రకారం ధోనీకి ఛాన్స్ లేదని తేల్చింది.