రణ్వీర్ – ప్రశాంత్ వర్మ కలసి ‘రాక్షస’ అనే టైటిల్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ వైదొలగినట్టు జోరుగా ప్రచారమవుతోంది. దీంతో నిర్మాతలు, హీరో దర్శకుడు అధికారిక ప్రకటన ఇచ్చారు. రాక్షస్ కి ఇది సరైన సమయం కాదని, భవిష్యత్ లో వుంటుందని చెప్పారు.
“ప్రశాంత్ చాలా ప్రతిభావంతుడు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని భావిస్తున్నాం. భవిష్యత్ లో తప్పకుండా కలిసిపని చేస్తాం’అన్నారు రణ్వీర్. ‘రణ్వీర్ అరుదైన నటుడు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మేము కలసి పని చేస్తాం’అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తూ భవిష్యత్ లో తప్పకుండా ఈ కాంబినేషన్ వుంటుందని చెప్పుకొచ్చింది.