జూన్ 1న వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పీఠం ఎవరు చేజిక్కించుకోనున్నారనే విషయంలో స్పష్టత వస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో తమకు ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా ఉండనున్నాయని, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే సంస్థలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోంది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకి ఏమాత్రం నిరాశాజనకంగా ఉన్నా… పార్టీ క్యాడర్ జూన్ 4న కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్లరని ఆ పార్టీ అధినాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు అధికారులు కూడా వైసీపీకి సహకరించరని అంచనా వేస్తోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఇవ్వాలని , ఇందుకోసం ఎగ్జిట్ పోల్స్ సంస్థలకు వైసీపీ భారీగా మూటజెప్పేందుకు సిద్దమైంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయి లో ఫలితాలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ, ఏపీకి సంబంధించి మాత్రం తమకు సపోర్ట్ గా ఫలితాలు ఇవ్వాలని వైసీపీ కోరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోందని.. అందులో కొన్ని అయినా తమకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించిన సరే అనే ఆశలతో వైసీపీ ఉందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.