మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించగా… ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లద్దని తీర్పునిచ్చింది.
1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఓ ప్రేమ జంట ఆశ్రయించగా.. వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. హిందూ యువతి, ముస్లిం యువకుడు చట్ట ప్రకారమే వివాహం చేసుకున్నా ముస్లిం లా ప్రకారం మతాంతర వివాహం చెల్లదని జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా స్పష్టం చేశారు.
ముస్లిం లా ప్రకారం విగ్రహారాధకురాలు అయినా హిందూ అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చట్టబద్దం కాదని తీర్పును ఇచ్చింది. ఇది ముస్లిం న్యాయ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.