అవును… కేసీఆర్ కు ఆయన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇతరత్రా విషయాల్లో కాదు. రాజకీయ అంశాల్లోనే కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ సోనియా గాంధీ కమిట్మెంట్ వల్లే అరవై ఏళ్ల కల సాకరమైందని స్పష్టం చేశారు. ఆమె చొరవతోనే రాష్ట్రం ఏర్పడిందని అందులో ఎవరకీ ఎలాంటి సందేహం అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. సోనియా గాంధీకి అసెంబ్లీ సాక్షిగా కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్, తెలంగాణ ఎప్పుడు సంస్కారాన్ని కోల్పోదని, ఔదార్యంతోనే వ్యవహరిస్తుందన్నారు.
ఇక, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణకు సోనియా గాంధీని ఆహ్వానించడం పట్ల ట్వీట్ తో కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? సోనియా గాంధీ వల్లే అంటూ కాంగ్రెస్ వైఖరిని తూర్పారబట్టారు. దీంతో కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్, గతంలో కేసీఆర్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పిన వీడియోను జత చేసి కేసీఆర్ కు కొడుకు కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ ఎప్పుడు సంస్కారాన్ని కోల్పోదని కానీ, కేటీఆర్ మాత్రం సోనియా గాంధీ చొరవను అభినందించకుండా విమర్శించడం అనైతికమని మండిపడుతున్నారు. అసలైన తెలంగాణ వాసులకైతే ఆ సంస్కారం ఉండేదని.. విదేశాల్లో పెరిగి అక్కడే ఎదిగిన కేటీఆర్ కు తెలంగాణ ఔదార్యం ఎలా తెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.