దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణె పోర్షే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును వేగంగా నడిపి ఇద్దరి ప్రాణాలను బలిగొన్న మైనర్ తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు అతని తల్లి కుట్ర చేసిందని, ఇందుకోసం కుమారుడి బ్లడ్ శాంపిల్స్ ని మార్పించిందని ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోర్షే కారు హిట్ అండ్ రన్ కేసులో కొడుకును తప్పించుకునేందుకు మైనర్ తల్లి పెద్ద స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడైన మైనర్ రక్త పరీక్షలు పూర్తి అయ్యాక, ఆ బ్లడ్ శాంపిల్స్ ను మార్చేలా అతని తల్లి వైద్యులపై ఒత్తిడి చేసిందని, దాంతోనే ప్రమాద సమయంలో నిందితుడు మద్యం మత్తులో లేడని సాసూన్ జనరల్ ఆస్పత్రికి చెందిన వైద్యులు రిపోర్ట్ ఇచ్చినట్లుగా తేల్చారు.
అయితే, ఆ బ్లడ్ శాంపిల్ నిందితుడి తల్లిదని కొడుకును రక్షించేందుకు ఆమె కుట్రకు పాల్పడటంతో.. మైనర్ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.