తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పదేండ్ల పండుగ నిర్వహిస్తుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గేయాన్ని జాతికి అంకితం చేయటంతో పాటు రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని సన్మానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రేవంత్ ఢిల్లీ వెళ్లి మరీ, సోనియాను ఆహ్వానించారు.
అయితే, ఇప్పటి వరకు సోనియాగాంధీ హైదరాబాద్ టూర్ ఫిక్స్ కాలేదు. సోనియా గాంధీ కొంతకాలంగా అనారోగ్యం కారణంగా పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగానూ ఒక్క రాయబరేలీలో ఒక్క మీటింగ్ కు మినహా ఎక్కడా ప్రచారం చేయలేదు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.
పైగా, దేశంలో హీట్ వేవ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో… సోనియాగాంధీ టూర్ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సీనియర్ నేతలు అయితే, సోనియాగాంధీ టూర్ క్యాన్సిల్ అవ్వొచ్చన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఒకవేళ సోనియా గాంధీ రాలేకపోతే… ఎవరిని పిలవాలన్న చర్చ కూడా గాంధీభవన్ లో జోరుగా సాగుతోంది.
సోనియాగాంధీ టూర్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకోరని… సోనియాగాంధీ వచ్చి వెళ్తారన్న నమ్మకం ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.