లోక్ సభ ఎన్నికలు తన వంద రోజుల పాలనకు రెఫరెండమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఫలితాలను సాధించనున్నారు..? ఆయన ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ 13 -14 సీట్లను కైవసం చేసుకోబోతుందా..? సొంత చరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్… లోక్ సభ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను రాబడుతారా..? లేక ఫెయిల్ అవుతారా..?
లోక్ సభ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం సమీపించడంతో తెలంగాణలో ఇప్పుడు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. సీఎంగా భాద్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే పాలనలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని , ఆరు గ్యారంటీలను సాధ్యమైన మేర అమలు చేశామని.. తన వంద రోజుల పాలనకు మార్కులు వేయండి అని రేవంత్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండమని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.తన వంద రోజుల పాలనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని రేవంత్ కు అంత నమ్మకమేంటనే చర్చ అప్పట్లోనే జోరుగా జరిగింది. ఎన్నికలైతే ముగిశాయి.. మరో మూడు రోజుల్లో రేవంత్ పాలనకు ప్రజలు ఎన్ని మార్కులు వేశారు అనేది తేలనుంది.
అయితే, తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ప్రధానంగా ఫోకస్ పెట్టడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అనుసరించిన విధానం కాషాయ పార్టీకి బిగ్ అడ్వాంటేజ్ గా మారింది. బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు వహించం, మోడీ చరిష్మా పని చేయడంతో పోలింగ్ నాటికి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారన్న ప్రచారం జరిగింది.పైగా డబుల్ డిజిట్ ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తన పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించిన రేవంత్…కనీసం కాంగ్రెస్ 10 సీట్లను కైవసం చేసుకుంటేనే తను ఈ ఎన్నికల్లో పాస్ అయినట్లు అని, 10 సీట్లలోపే పరిమితమైతే రేవంత్ ఫెయిల్ అయినట్లేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.చూడాలి మరి రేవంత్ కు పాసు మార్కులు పడుతాయా..? లేదా అనేది..