ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. జానికి రెండో విడత పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తాము దూకుడుగా ఉన్నామని కాంగ్రెస్ నమ్ముతోంది. బీజేపీ ప్రచారం చేసకునే నాలుగు వందల సీట్లు అనేది ఓ భ్రమ అని.. ప్రతీ చోటా వెనుకబడి పోతున్నారని చెబుతూ వస్తున్నారు. చాలా మంది సెఫాలజిస్టులు కూడా అదే చెప్పారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ మరితం ఉత్సాహంగా ఎగ్జిట్ పోల్స్ గురించి ఎదురు చూడాల్సి ఉంది.
ప్రజలు ఓట్లేసేశారని వారి తీర్పు బ్యాలెట్లలో ఉన్నందున చర్చించాల్సింది ఏమీ ఉండదని అందుకే తాము చర్చల్లో పాల్గొనడం లేదని అటున్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసా.. అందరికీ తెలుసకదా. పోల్ ఎనాలసిస్ అనేది అన్ని పార్టీలు చేసుకుంటాయి. చర్చల్లో పాల్గొనకపోవడం వల్ల .. ఆ పార్టీకి నమ్మకం లేదన్న అభిప్రాయం బలపడుతుంది. అదే జరుగుతుంది కూడా.
ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వెనుకబడిపోతుదంని.. ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తుందని చెబితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెంటనే సానుకూల ప్రకటనలు చేస్తుంది. గెలవబోయేది తామేనని.. వాటిని సమర్థించుకుంటూ ముందుకు వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న మీడియా సంస్థలు తమకు ఎగ్జిట్ పోల్స్ సరైన రీతిలో ఇవ్వవని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే వారు చర్చలకు ఎగ్గొడ్తున్నారు. అయితే .. ఫలితాలప్పుడు చర్చించడానికి కూడా పెద్దగా ఏమీ ఉండదని కాంగ్రెస్కు ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు.