వైసీపీ అధినాయకత్వం జాతీయ స్థాయిలో కొన్ని చానళ్లను ప్రత్యేకంగా అభిమాన చానళ్లుగా ఎంచుకుంది. వాటికి ప్రజాధనం.. కోట్లలో కట్టబెట్టింది. ఇమేజ్ పెంచడానికని… ఈవెంట్ నిర్వహించడానికని.. కాంక్లేవ్ లు పెట్టడానికని.. ఇలా రకరకాలుగా ఆయా చానళ్లకు లబ్ది చేకూర్చి … అనుకూలమైన వార్తలు ప్రసారమయ్యేలా చేసుకుంది. ఎన్డీటీవీ ప్రతినిధులు అయితే.. వైసీపీ తరపున చిన్న లీడర్ ర్యాలీ చేసినా ఆహో ఓహో అని ప్రచారం చేసేస్తారు. అలా ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే వంటి చానళ్లను బాగానే కాకా పట్టారు.
తాడేపల్లి కంపెనీ ఈటీడీ కూడా …వైసీపీకి బీభత్సమైన ఆధిక్యం ఇవ్వడానికి సంశయపడింది. రెండు నెలల కిందటి వరకూ వైసీపీకి పాతిక సీట్లు వస్తాయని ఈ సర్వే చెప్పేది. చివరికి ఎగ్టిట్ పోల్స్ లో కూటమికి 11 వస్తాయని చెప్పాల్సి వచ్చింది. ఈ కంపెనీ అవినాష్ ఇరగవరపు అనే వ్యక్తిది. సీఎంవోలో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు జగన్ , ఆయన సతీమణి ఇచ్చిన ఆతిధ్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ మీడియా చానల్ కు కాంక్లేవ్ పేరుతో కట్టబెట్టిన కోట్లెన్నో లెక్కే లేదు. అయినా ఎవరూ సర్వేలను మ్యానిప్యులేట్ చేయడానికి సిద్ధపడలేదు.
గతంలో టీడీపీ కూడా లోకల్ సర్వేలను నమ్ముకుంది. వారు టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా సర్వేలు ఇచ్చారు. అప్పుడు భారీగా నష్టపోయింది టీడీపీనే. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ఎదుర్కొంటోంది. కానీ అంత కంటే ఎక్కువ దుర్భరంగా పరాజయం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.