జాతీయ మీడియా చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. స్పష్టంగా ఎవరెవరికి ప్రకటించాయో కళ్ల ముందు కనిపిస్తున్నా… తెలుగులో రెండు చానళ్లు మాత్రం… అన్నీ వైసీపీకే అనుకూలంగా వస్తున్నాయని నమ్మించేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. టీవీ 9 అపసోపాలు పడింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే , ఏబీపీ లాంటి ప్రసిద్ధి చెందిన ఎగ్టిట్ పోల్స్ ను పట్టించుకోకుండా… చిత్ర విచిత్రమైన విశ్లేషణ చెప్పిన ఆరా మస్తాన్ ను మాత్రమే నమ్ముకుంది. అదే పదే పదే ప్రచారం చేసింది.
ఇక ఎన్టీవీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏబీపీ సీఓటర్ చాలా స్పష్టంగా లోక్ సభ పోల్స్ లో కూటమి సునామీ ఖాయమని తేల్చేసింది. వైసీపీకి సున్నా నుంచి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. ప్రజాభిప్రాయం అంత ఏకపక్షంగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అయినా అసెంబ్లీకి ఏబీపీ సీఓటర్ వైసీపీకి మెజారిటీ ఇచ్చిందని బ్రేకింగ్స్ వేశారు. ఆ ఫేక్ న్యూస్ వైరల్ చేసుకుంది.
2014లో తప్పుడు సర్వే ఇచ్చి పరువు పోగొట్టుకున్న ఎన్టీవీ తర్వాత సర్వేల జోలికి వెళ్లలేదు. కానీ ఇలా వైసీపీ కోసం ఫేక్ సర్వేలు ప్రచారం చేయడం మాత్రం ఆపలేదు. ఆ రెండు చానళ్లు.. వైసీపీతో అంటకాగి నాశనం అయిపోయాయి. నాలుగో తేదీ తర్వాత వీటిపై ప్రజలు మరింతగా నమ్మకం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.