యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇండియా టుడేలో ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితత్వం మరోసారి స్పష్టమయింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన నాలుగు రాష్ట్రాల్లో రెండు ఈశాన్యరాష్ట్రాల్లో ఆదివారమే కౌంటింగ్ నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో కౌంటింగ్ నిర్వహించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్స్ ను ఇండియాటుడే యాక్సిస్ సంస్థ శనివారం రాత్రి ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 44 నుంచి 51 సీట్లను గెలుచుకుంటుందని యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్ లో ప్రకటించింది. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. బీజేపీ 45 సీట్లను గెల్చుకుంటోంది. గతం కన్నా ఎనిమిది సీట్లను గెల్చుకుంది. అరుణాచల్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇక సిక్కింలో సిక్కిం క్రాంతి కార్ మోర్చా పార్టీ 24 నుంచి 30 సీట్లను గెల్చుకుంటుందని యాక్సిస్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇప్పటి వరకూ సిక్కిం క్రాంతికార్ మోర్చా 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పార్లమెంట్ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరో రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు మై యాక్సిస్ ఇంకా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. ఆదివారం సాయంత్రం వాటిని ప్రకటించనున్నారు.