ఒక్క రోజులో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల అధినేతలు అభ్యర్థులకు జాగ్రత్తలు చెబుతూ ఆన్ లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది నేతలతో సమావేశమవుతున్నారు. కానీ జగన్ మాత్రం.. పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. ఆయనకు బదులుగా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డినే ముందుకు వచ్చి అన్ని పనులు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు.. అభ్యర్థులకు ఆయనే సందేశాలు ఇస్తున్నారు. జగన్ ధైర్యం చెబితే బాగుండని అభ్యర్థులు కూడా అనుకుంటున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్.. అక్కడ వారికి ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు సాధిస్తామని చెప్పారు. 151 కన్నా ఎక్కువ వస్తాయన్నారు. నిజానికి ఆ మాట చెప్పాల్సింది ఐ ప్యాక్. ఎందుకంటే ఫీల్డ్ సర్వేలు చేసేది వారే. మరి ఈ మాట జగన్ తన అభ్యర్థులకు చెప్పలేదు. క్యాడర్ కు చెప్పలేదు. చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన సైలెంట్ అయిపోయారు.
ఎగ్జిట్ పోల్స్ లో ప్రతి అభిమాని చెప్పిన సర్వేను ప్రచురించుకోవాల్సి వచ్చింది. క్రిడిబులిటీ ఉన్న సర్వేల గురించి మాత్రం ప్రచురించుకోలేకపోయారు. ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను చూసి జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదని.. ఏమైనా చెప్పాలనుకుంటే సజ్జలకు మాత్రమే చెబుతున్నారని అంటున్నారు.