పోలింగ్ అనంతరం పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతుల చేసిన ఉద్దేశపూర్వక హింస… చివరికి వారికే చుట్టుకుంది. వారి క్యాడర్ర్ పై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి… కదలకుండా చేస్తున్నారు. నేర నేపధ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారు. రౌడీషీట్ ఉన్న వారిని బైండోవర్ చేశారు. ఇంకా తీవ్ర నేర స్వభావం ఉన్న వారిని జిల్లాల బహిష్కరణ చేశారు. వైసీపీకీ.. వైసీపీ కొనుగోలు చేసి పెట్టుకున్న ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎజెంట్లపై షాడో పార్టీలను పెట్టారు.
ఏ ఉద్దేశంతో పోలింగ్ అనంతరం హింసకు పాల్పడ్డారో కానీ.. ఇప్పుడు అదే వైసీపీకి శాపంగా మారుతోంది. ముఖ్యమైన నేతలంతా పోలీసు రాడార్లో ఉంటే.. కీలక అభ్యర్థులు అటూ ఇటూ కదల్లేని పరిస్థితికిపోయారు. ముందస్తు బెయిల్ తెచ్చుకోలేని వారు పరారీలో ఉన్నారు. ఫలితాల తర్వాత వారు వస్తారా అటు నుంచి అటు ఆజ్ఞాతంలోకి పోతారా అన్నదానిపై స్పష్టత వస్తుంది.
అవసరం లేని హింస చేసి.. కౌంటింగ్ సమయంలో మరిన్ని జాగ్ర్తత్తలు తీసుకునేలా చేసింది వైసీపీనే. రూల్స్ పాటించవద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలతో మరింత మైనస్ అయింది. వైసీపీ ఎజెంట్ల విషయంలో ప్రత్యేక జాగ్ర్తతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా… తాము ఏదో చేస్తామని బెదిరించడం ద్వారా మొత్తానికే నష్టం చేసుకుంది వైసీపీ. ఇప్పుడు కౌంటింగ్ సెంటర్లలో గట్టిగా నోరెత్తలేని పరిస్థితి.