ఢిల్లీ లిక్కర్ స్కాంలో నా పాత్ర లేదంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అరుణ్ పిళ్లై తన ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమేనని… వీకెండ్స్ లో కలిసేవారిమని, అయితే నా తరఫున పెట్టుబడి పెట్టారనేది సరికాదని కవిత చెప్పినట్లు ఈడీ తన చార్జ్ షీట్ కోర్టుకు తెలిపారు. అయితే, అరుణ్ పిళ్లై లావాదేవీలతో తనకేం సంబంధం లేదన్నారు.
లిక్కర్ స్కాంలో అందరితో మాట్లాడమని తాను బుచ్చిబాబుకు ఆథరైజేషన్ ఏమీ ఇవ్వలేదని… మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చాలాసార్లు కలిశానని తెలిపారు. రాఘవరెడ్డిని మాత్రం ఒక్కసారే కలిశానని, ఇండో స్పిరిట్ కు తనకు సంబంధం లేదని కవిత స్టేట్మెంట్ ఇచ్చారు.
నా తరఫున ఎవరూ ఆప్ ను సంప్రదించటం, లంచాలు ఇవ్వటం చేయలేదని… అభిషేక్ కు ఇండియాహెడ్ ఛానెల్ లో వాటా ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. అయితే, ఇండియా హెడ్ లో తనను పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ కోరినట్లు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను 32వ నిందితురాలిగా ఈడీ చేర్చింది. ఆప్ కు గోవా ఎన్నికల సమయంలో 100కోట్లు ముడుపులు అందటంలో కవితే కీలకం అని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది.