జగన్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన సేవలో మునిగి ప్రతిపక్ష నేతల్ని వేధింపులకు గురి చేయడమే తమ ఉద్యోగంగా మార్చకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా టైట్ చేస్తున్నారు. మన్నించాలని కోరేందుకో.. మరో కారణమో కానీ చంద్రబాబును కలుస్తామంటూ ఇలాంటి అధికారులు ముందస్తు అనుమతి లేకుండా తాడేపల్లికి వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీస్ కానిస్టేబుళ్లు గుర్తించి వెనక్కి పంపేస్తున్నారు.
సీఐడీ చీఫ్ సంజయ్ సెలవు పెట్టి అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రద్దు చేయించారు. ఇప్పుడు ఆయన హడావుడిగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద ఆయనకు అనుమతి పోలీసులు ఆపేశారు. అయితే చాలా సేపు కదిలేందుకు ఆయన నిరాకరించడంతో కారును బలవంతంగా పక్కకు తీయించారు పోలీసులు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుకూ ఇదే అనుభవం ఎదురయింది.
చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికీ ఇదే పరిస్థితి. ఆయనను కలిసేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. గుంటూరు కలెక్టర్ వేణగోపాల్ రెడ్డిని కూడా కలిసేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. వైసీపీ సర్వీస్ లో నిండా మునిగిపోయిన అధికారుల మొహాలు చూసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. సీఎస్ ను సెలవు పెట్టి వెళ్లిపోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అయితే జవహర్ రెడ్డి ఇంకా ఆలోచిస్తున్నారు.
ప్రతీ సారి చంద్రబాబు అధికారుల విషయంలో ఇంత కఠినంగా ఉండరు. కానీ ఈ సారి మాత్రం వారి ఓవరాక్షన్‌కు తగ్గ ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఇలాంటి వారి లిస్ట్ చేసుకున్నారు. దాని ప్రకారం.. చర్యలు చాలా వైల్డ్ గా ఉంటాయని అంటున్నారు.