ఎంపీ ధర్మపురి అరవింద్. వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్… ఎన్నికల సమయంలోనే తనకు మంత్రి పదవి దక్కబోతుందని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఈసారి తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని, కిషన్ రెడ్డితో పాటు తనకు మంత్రిపదవి పక్కా అని అరవింద్ తో పాటు ఆయన అనుచరులు చెప్పుకున్నారు.
బండి సంజయ్ ను ఇప్పటికే పార్టీ పదవిలోకి తీసుకున్నారని… కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున తనకు ఇవ్వరని, ఇక ఈటల కొత్తగా వచ్చారు కాబట్టి తనకు పోటీయే లేరని, పైగా తాను బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కాబట్టి అదనపు అడ్వాంటేజ్ అని ఆయన భావించారు.
అరవింద్ ఒక్కరే కాదు ఓబీసీ కోటాలో అనూహ్యంగా ఎంపీ సీటుతో పాటు కేంద్ర పార్టీలో కీలకంగా ఉన్న కె.లక్ష్మణ్ తో పాటు ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తమకు కేంద్రమంత్రివర్గంలో చోటు వస్తుందన్న ఆశలో ఉన్నవారే.
కానీ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి… ఒక్క ఎమ్మెల్యే ఉన్నా 4 ఎంపీలను గెలిపించటంతో పాటు పార్టీని డెవప్ చేసిన బండి సంజయ్ ను పార్టీ గుర్తించింది. ఇప్పుడొచ్చిన 8 ఎంపీల వెనుక పార్టీ క్యాడర్ నిర్మించటంలో బండి సంజయ్ కష్టం ఉందన్న నమ్మకంతోనే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. ఇక సౌమ్ముడు, వివాదరహితుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి పొడిగింపు దక్కినట్లు కనపడుతోంది.
అయితే, భవిష్యత్ లో జరిగే క్యాబినెట్ విస్తరణలో ఒక్క సహయ పదవి అయినా దక్కుతుందన్న ఆశ ఇంకా తెలంగాణ బీజేపీ నేతల్లో ఉంది.