చరిత్రలో నిలబడిపోయిన ఎలాంటి గొప్ప వ్యక్తి, సంస్థ , నగరం ఏదైనా ఆషామాషీగా ఎదగలేదు. ఓ స్ట్రగుల్ ఉంటుంది. అష్టకష్టాలు పడి పైకి వచ్చిన వారికే గుర్తింపు ఉంటుంది. సాఫీగా శిఖరానికి చేరిపోయే వారికి ఎలాంటి గుర్తింపు, ప్రత్యేకత రాదు. ఈ రోజు హీరోషిమా, నాగసాకి నగరాల గురించి ప్రపంచ్యాప్తంగా చెప్పుకుంటున్నారంటే..దానికి కారణం ఆ నగరాల చరిత్ర. ప్రపంచంలో అణుబంబు దాడులు ఎదుర్కొన్న రెండే నగరాలు అవి. అక్కడి విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం అంతా కన్నీరు పెట్టేంత నష్టం ఆ నగరాలకు జరిగింది. కానీ ఇప్పుడా నగరం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. ఇప్పుడీ నగరంలో దాదాపు 12 లక్షల మంది జనాభ నివసిస్తున్నారు. చక్కని, అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. మంచి నీటి వనరుల కోసం అనేక చర్యలు చేపట్టింది. పెద్ద కంపెనీలున్నాయి. ఆధునిక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అనేక సాంస్కృతిక కేంద్రాలు నిర్మించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంది. అంటే.. శూన్యం నంచి ఇంకా చెప్పాలంటే అణుబాంబు దాడితో పాతాళానికి పడిపోయి మళ్లీ పునరుజ్జీవం పొందింది కాబట్టే ఇప్పుడు అందరూ వాటి గురించి గుర్తుంచుకుంటున్నారు. ఇప్పటి నుంచి వచ్చే తరానికి అమరావతి కూడా అలాంటి గుర్తింపు పొందనుంది. జగన్ రెడ్డి లాంటి అరాచక అణుబాంబు కంటే ప్రమాదకమైన వైరస్ ఆ నగరానికి సోకిన.. బయటపడిన తర్వాత రాబోయే రోజుల్లో దేశానికి తలమానికం అయ్యేందుకు పరుగులు పెట్టనుంది.
అమరావతిపై అణుబాంబులా పడిన జగన్ రెడ్డి !
అమరావతి పై ఎన్ని కుట్రలు జరిగాయో లెక్కే లేదు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ రెడ్డి గెలిచేందుకు కూడా అదే రాజధానిగా అభివృద్ది చేస్తామని చంద్రబాబు ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయాడని ప్రచారం చేసి.. ఓట్లు వేయించుకున్నారు. తాను అక్కడే ఇల్లు కట్టుకున్నానని నంగి నంగిగా చెప్పిన మాటలు విని ప్రజలు కూడా నిజమే అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అణుబాంబు నైజం బయటపడింది. మూడు రాజధానుల పేరుతో ఆయన ఆడిన వికృత నాటకం అమరావతిని సర్వనాశనం చేసింది. చంద్రబాబునాయుడు అమరావతి పర్యటకు వెళ్తే.. వేల కోట్ల విలువైన సంపదను.. అంతకు మించిన రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఆశల్ని ఎలా తునాతునకలు చేశారో అర్థమైపోతుంది. విధ్వంసానికి ప్రతీకగా ఇప్పటికీ ప్రజావేదిక అక్కడే ఉంది. నలభై వేల కోట్ల విలువైన పనులు..మధ్యలో ఉండిపోయాయి. వీటిలో 90శాతం పూర్తయిన భవనాలు కూడా ఉన్నాయి. అన్నింటినీ అలా వదిలేశారు. పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి. జంగిల్ క్లియరెన్స్ చేయడానికే చాలా రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బాధ్యత ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా ప్రజాధనాన్ని విధ్వంసం చేయాలని అనుకోరు. ఎందుకంటే అది ఆయన సొంతం కాదు.. ప్రజల ఆస్తి. ప్రజలు ఓట్లేసి గెలిపించింది తమను నాశనం చేయమని కాదు. బాగు చేయడం చేత కాకపోతే కనీసం నాశనం చేయకుండా ఉండాలి. కానీ పట్టుబట్టి మరీ ఐదేళ్ల పాటు కుట్రలు చేసి నిర్వీర్యం చేయడానికి చేయని ప్రయత్నాలు లేవు.
మాట తప్పిన జగన్ను పాతాళానికి పంపిన ప్రజలు
హీరోషిమాపై ఒక్క సారే అణుబాంబు దాడి జరిగింది. కానీ అమరావతిపై ఐదేళ్ల పాటు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు జగన్. అమరావతి రైతుల కడుపుల మీద తన్నారు. మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి ఒక్క అంశాన్ని అమరావతిపైనే ఎక్కు పెట్టి లేవకుండా చంపాలనుకన్నారు. అయితే ప్రతి దశలోనూ జగన్ ఎదురు దెబ్బలే తిన్నారు. మొదట మూడు రాజధానుల బిల్లు పెట్టి.. చివరికి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇళ్ల స్థలాల విషయంలోనూ అంతే. ఏదీ కూడా జగన్ కు అనుకూలంగా లేదు. ఎందుకంటే.. ఆయన తప్పుడు పని చేస్తున్నారు. న్యాయం , ధర్మం ఎప్పుడూ ఆయన వైపు లేవు. కానీ నమ్మి ప్రజలు ఇచ్చిన అధికారం ఉంది. ఆ అధికారంతో ప్రజల్నే వెన్నుపోటు పొడుస్తూ ప్రశ్నంచిన వారిని పరలోకానికి పంపుతానన్నట్లుగా వ్యవహరిస్తూ పోయారు. అయినా అమరావతిని ఐదేళ్లుగా రైతులు కాపాడుకుంటూనే వచ్చారు. రైతుల పోరాట స్ఫూర్తికి.. న్యాయం , ధర్మం కలసి వచ్చాయి. జగన్ రెడ్డి వేసిన ఎన్నో అణుబాంబుల్లాంటి దాడులను ఎదుర్కొని అమరావతి ప్రాణం నిలుపుకుంటూనే ఉంది. చివరికి జగన్ రెడ్డి చేసిన తప్పేంటో ప్రజలు ఓటు ద్వారా చెప్పారు.. అంత కంటే ఎక్కువగా .. శిక్షించారు. ఆయన పార్టీపైనే ఓట్ల అణుబాంబు వేశారు.
అమరావతికే అన్ని ప్రాంతాల ప్రజల సపోర్ట్
గత ఎన్నికల్లో అమరావతినే అమరావతినే రాజధాని అని బిగ్గరగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి తర్వాత మూడు రాజధానుల పాట ఎత్తుకుని మళ్లీ ఈ మేనిఫెస్టోలో మూడు రాజధానులు అంటూ బయలుదేరారు. కానీ ప్రజలు ఒక్క సారి మోసపోతారు. ప్రతీ సారి మోసపోరు కదా. వైజాగ్ ను రాజధాని చేస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధి అని జగన్ చెప్పిన మాటల్ని ఎవరూ నమ్మలేదు. విశాఖలో వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరు దగ్గర దగ్గర లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, భీమిలి, పెందుర్తి సహా.. ఏ నియోజకవర్గం చూసుకున్నా.. మెజార్టీలు చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు ఎంత ఘోరంగా తిరస్కరించారో అర్థమైపోతుంది. ఉత్తరాంధ్ర పేరుతో ఆయన చేయాలనుకున్న సెంటిమెంట్ రాజకీయాలను ఆయన కూడా ఊహించంత వేగంగా మొహానకేసి కొట్టారు. సీట్లు రాకపోవడం సమస్య కాదు… అసలు వైసీపీ అనే పార్టీనే లేదన్నట్లగా ఫలితాలు వచ్చాయి. పోనీ కర్నూలు అయినా పరువు దక్కిందా అంటే అదీ లేదు. అక్కడి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించలేదు. హైకోర్టు పెట్టేస్తామని చెప్పి.. పెయిడ్ ఆర్టిస్టులతో సెంటిమెంట్ రాజకీయాలు పండించారు.. కానీ అక్కడి ప్రజల్లో రాజధాని పేరుతో చేస్తున్న రాజకీయానికి ఛీకొట్టేందుకు రెడీ అయ్యారని గుర్తించలేకపోయారు. ఎన్నికలకు ముందే కొన్ని జాతీయ మీడియా సంస్థలు కర్నూలులో ప్రజల అభిప్రాయాలను తీసుకుంటే.. కింది స్థాయి వర్గాలు కూడా జగన్ మూడు రాజధానుల ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా ఉండాలని.. వైజాగ్ అయితే రాయలసీమకు ఎలా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. కానీ తన సొంత రాజకీయ ఎజెండాతో… స్వార్థంతో ఉత్తరాంధ్ర ఆస్తులపై కన్నేసి చేసిన మూడు రాజధానుల రాజకీయంతో సర్వం పోగొట్టుకోవాల్సి వచ్చింది.
విధ్వంసానికి గురైన అమరావతిని చక్కదిద్దే బాధ్యత చంద్రబాబుదే !
ఇప్పుడు అమరావతి నగరం అణుబాంబుకు గురైన తర్వాత హిరోషిమా నగరంలా మిగిలింది. టీడీపీ అధినేత .. అమరావతి స్వాప్నికుడు చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు. ప్రజలు ఈ సారి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి..ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసి.. ఐదేళ్లలో ఏపీకి మహత్తరమైన రాజధానిని అందించాలని బాధ్యత కట్టబెట్టారు. నిజానికి ఆయన రెండో సారి గెలిచి ఉంటే.. ఈ ఐదేళ్లలో అమరావతి ఓ అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుని ఉండేది. రెండు వందలకుపైగా సంస్థలకు భూములు కేటాయించారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉండేవి. అంతర్జాతీయ సంస్థలు వచ్చేవి. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు వచ్చేవి. కానీ.. జగన్ రెడ్డి అనే అణుబాంబు బారిన పడాలని రాసి పెట్టి ఉంది.. అందుకే అమరావతికి గత ఐదేళ్లు దరిద్రం పట్టుకుంది. ఇప్పుడు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబునాయుడు మళ్లీ రంగంలోకి దిగారు. 74 ఏళ్ల వయసులో ఆయన శక్తి వంచన లేకుండా ఏపీకి .. ప్రపంచ స్థాయి రాజధానిని అందించేందకు శ్రమించేందుకు సిద్దమయ్యారు. గతంలో చంద్రబాబు ఒకటే చెప్పేవారు.. జగన్ మోహన్ రెడ్డి అనే విపత్తు మళ్లీ రాష్ట్రానికి వస్తుందని అనిపిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రారు. ఆ పార్టీ లేకుండా తరిమిస్తేనే.. ఏపీకి మంచి రోజులు అని. ప్రజలు దాదాపుగా అలాంటి తీర్పునే ఇచ్చారు. ఇప్పుడు జగన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన చేసిన అవినీతికి.. ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పడం కూడా కష్టం. రెండేళ్ల తర్వాత వైసీపీ పార్టీ ఉంటుందో … కాంగ్రెస్లో కలుస్తుందోనని ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. అంటే.. అమరావతిపై పడిన అణుబాంబు నిర్వీర్యం అవడానికి దగ్గర పడింది. ఇంత కంటే మంచి శకునం అమరావతికి ఉండదు.
స్ట్రగుల్ పడి ఎదిగిన వ్యక్తి, సంస్థ, వ్యవస్థలకే చరిత్రలో గుర్తింపు – అమరావతి అలాంటిదే !
ఇప్పుడు అంతా బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఆయన విజన్ మొదటి నుంచి సుస్పష్టం. తాను శాశ్వతం కాదని..రాష్ట్రం శాశ్వతమని.. పోలవరం, అమరావతి శాశ్వతమని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. అమరావతిని, పోలవరాన్ని ప్రజలకు అంకింత చేయాలన్నది ఆయన పట్టుదల. వయసు కారణంగా రాను రాను తనలో శక్తి కూడా ఉడిగిపోతుదంని ఆయనకూ తెలుసు.కానీ ఆయన మనోబలం మాత్రం చెక్కు చెదరదు. అదే ఇప్పుడు ప్రజల నమ్మకం. ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసాన్ని అమరావతి రైతులు చేశారు. రోడ్డు విస్తరణకు అర ఎకరం భూసేకరణ చేయడానికి తంటాలు పడే దేశంలో.. 35 వేల ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారు. అమరావతితో పాటు తాము కూడా ఎదుగుతామని ఆశపడ్డారు. రాష్ట్ర ఆర్థిక ఆయువుపట్టుకు తాము కొంత ధారబోశామని అనుకున్నారు. అంతే కాదు వారు రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది. ఐదేళ్లు మహాపోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పోరాటం ఫలించింది. విజేతలుగా నిలచారు.
ముందుగా అనుకున్నట్లుగా అమరావతి అనే నగరం ఏదో ఆషామాషీగా నిర్మితమై ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అమరావతిలో జరిగే ప్రతి పని అద్భుతమే. రెండున్నరేళ్లలో అమరావతి మొదటి దశను పూర్తి చేస్తే.. ఆటోమేటిక్గా ప్రభుత్వ, ప్రైవేట సంస్థల కార్యాలయాలు రాజధానికి క్యూ కడతాయి. విద్య, ఉపాధి నగరంగా మారుతుంది. ఒక్క సారి ఊపందుకుంటే.. మరే అణుబాంబు.. అమరావతి అభివృద్ధిని ఆపలేదు. రాష్ట్ర ప్రజల రాతను చెడగొట్టలేదు.
జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి