వైసీపీ జిల్లా కార్యాయాలు పెద్ద పెద్ద ప్యాలెస్లుగా లా మెరిసిపోతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యంత ఖరీదైన స్థలంలో ప్రభుత్వం నుంచి ఎకరం రూ. వెయ్యికి ఏడాదికి లీజుకు తీసుకుని కోట్లు ఖర్చు పెట్టి కట్టేశారు. అన్ని జిల్లాల్లో కనీసం ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. ఈ సొమ్మంతా రాంకీ ఇన్ ఫ్రా .. అంటే ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పెట్టుకుంటున్నారు. ఆయనకు పార్టీ తరపున డబ్బులిస్తారా లేకపోతే… మరోసారి రాజ్యసభ ఇస్తానని ఆశ పెట్టారా అన్నది వారికే తెలియాలి.
ఈ ప్యాలెస్ నుంచి ఒక్క దానికీ అనుమతి తీసుకోలేదు. ఒక్క ప్రకాశం జిల్లా కార్యాలయానికి మాత్రమే అనుమతి తీసుకున్నారని మరెక్కడా ప్లాన్లు, అనుమతుల జోలికి వెళ్లలేదని ఈనాడు రిపోర్టు చేసింది. అదే నిజం అయితే అన్నింటినీ కూల్చివేయడానికి సరైన కారణం దొరికినట్లే. కట్టింది ప్రభుత్వ స్థలంలో … అదీ అనుమతుల్లేకుండా . వెంటనే లీజు క్యాన్సిల్ చేయడానికి కూడా ఓ కారణం దొరికినట్లే. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో వైసీపీ కార్యాలయాలను ఇలా ఇంద్ర భవనాలుగా కట్టేసుకుంటున్నారు కానీ.. మరి ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం కట్టారన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
అమరావతిని పాడు పెట్టారు. పోలవరం ఆపేశారు. సాగునీటి ప్రాజెక్టుల్ని నాశనం చేశారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ప్రజాధనంతో .. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. కానీ సొంత పార్టీకి… అసలు ఎలాంటి కార్యకలాపాలు ఉండని జిల్లాల్లో కూడా కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టించారు. వీటి గురించి అసలు నిజాలు బయటకు వస్తే ప్రజలు ఇంకెంత ఆశ్చర్యపోతారో ?