పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దరికం వెనుక ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం ఉందని ప్రభుత్వం వద్ద సాక్ష్యాధారాలతో సహా ఓ నివేదిక రెడీగా ఉంది. నేపాల్లో ఇటీవల ఓ ఎర్రచందనం వాహనం పట్టుబడింది. అది ఇండియా నుంచి అదీ కూడా చిత్తూరు నుంచి వచ్చినట్లుగా తేలింది. నిజానికి ఎర్రచందనం అనేది దేశంలో మరో చోట లేదు. శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. 2014-19 సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో స్మగ్లర్లను కట్టడి చేసి అడవిని కాపాడారు. కానీ గత ఐదేళ్లుగా స్మగ్లింగ్ కు ఎదురు లేకుండా పోయింది. ఎవరైనా ఆపినా పోలీసుల్ని చంపడానికి కూడా వెనుకాడావారు కాదు.
చివరికి పెద్దిరెడ్డికి పెద్ద పాలేరు అన్నట్లుగా వ్యవహరించిన పోలీసు అధికారి రిషాంత్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి టాస్క్ ఫోర్స్ చీఫ్ గా నియమించుకున్నారంటే… ఆ వ్యాపారం ఎలా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేపాల్ లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రికొడుకులదని తేలింది. ఆ విషయాన్ని పర్యావరణ మంత్రి పవన్ కల్యాణే వెల్లడించారు. ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకువచ్చి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
కుట్రలతో తమను రాజకీయంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించిన వారిని చూస్తూ ఊరుకునే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురంలో తనను ఓడించడానికి ఎర్రచందనం స్మగ్లింగ్ డబ్బే ఇష్టారాజ్యంగా పంచారని పవన్ కూ తెలుసు. అందుకే ఈ విషయంలో ఆయన మరింత పర్టిక్యులర్ గా ఉన్నారని చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై సంచలన నిజాలు బయపెట్టే స్టఫ్ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ఉందని తెలుస్తోంది.