బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒకలా ఉంటోంది.. పార్టీ అధినాయకత్వం, మరొకలా ఉంటోంది.. పూరీజగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కేసీఆర్ డైలాగును వాడటంపై వాళ్లలో వాళ్లే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. సోషల్ మీడియాలోనేమో.. కేసీఆర్ క్రేజ్ అంటే ఇది అని.. బీఆర్ఎస్ ఫాలోవర్లు ఫోజులు కొడుతోంటే.. ఆ పార్టీ అనుకూల పత్రికలో పూరీ జగన్నాథ్ ను విమర్శిస్తూ ఆర్టికల్ ప్రచురించారు.
సినిమాలో కేసీఆర్ డైలాగ్ వాడారని విషయం బయటకు రాగానే కేసీఆర్ కు ఎలివేషన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఇదే కంటెంట్ ను పూర్తిగా నింపేశారు. తీరా మరుసటి రోజు నమస్తే తెలంగాణలో పూరి జగన్నాథ్ ను తిడుతూ ఆర్టికల్ వేశారు. తెలంగాణ భాషను అవమానించడమే లక్ష్యంగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని కల్లు కంపౌండ్ సీన్ లో కేసీఆర్ డైలాగ్ ను వాడేశారని రాసుకొచ్చారు. ఇలా ఒకే అంశానికి చెందిన దాంట్లో బీఆర్ఎస్ లోనే ఏకాభిప్రాయం లేదని స్పష్టమైంది.
దీంతో బీఆర్ఎస్ లో ఓ రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఒకే విషయంలో పార్టీ నేతలు- సోషల్ మీడియా విభాగం ఇలా.. రెండు విధానాలను అనుసరిస్తుండటంతో పార్టీలో కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతోంది. దీని వలన క్యాడర్ కూడా అయోమయానికి గురి అవుతోంది. ఒక విషయంలో పార్టీ స్టాండ్ ఏంటనేది ఆ పార్టీ నేతలకే సరైన క్లారిటి లేదని అందుకే ఈ విధమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు. నడిపించే నాయకుడు అందుబాటులో లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందని చెబుతున్నారు.