రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు మూసీ సుందరీకరణ. తన ఐదేళ్ల పాలనా కాలంలోనే విజిబుల్ అభివృద్ధి చూపించాలంటే… మూసిని అద్భుతంగా చేయడమే సింపుల్ గా అయిపోతుందనుకున్నారు. రంగంలోకి దిగారు. సీరియస్ గా ఆ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్ అనుకున్న దాంట్లో సగం జరిగినా హైదరాబాద్ మరింత అందమైన నగరంగా మారుతుంది.
గండిపేట జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కున ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు సరిహద్దు వరకు మూసి ప్రాజెక్టును భాగంగా చేశారు. హిమాయత్‌సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వద్ద మూసీ, ఈసీ నదుల సంగమం వరకు మొత్తం 59 కి.మీ మేర ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా మాస్టర్ ప్లాన్ లో భాగం చేశారు.
బ్లూ మాస్టర్ ప్లాన్, మార్కెట్ ఫీసబిలిటీ స్టడీ, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్లు రెడీ చేయడానికి కన్సల్టెన్సీను ఎంపిక చేశారు. బ్లూ మాస్టర్‌ప్లాన్‌లో స్థిరమైన నీటి వనరుల వినియోగంపై, రక్షణపై పటిష్టమైన చర్యలుంటాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నారు.
మొత్తం ప్రాజెక్టు విలువను 58కోట్లకుపైగా ఉంటుంది. ఇప్పటికే పీపీపీ పద్దతిలోటెండర్లు పిలిచారు. ఇప్పటికే అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. అక్రమ కట్టడాలు ఓ సవాల్ గా మారనున్నాయి. మూసిలో పన్నెండు వేల అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా ప్రాథమింగా గుర్తించారు. నిధుల సమీకరణ పై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పీపీపీ పద్దతిలో టెండర్లు పిలిచినందున ప్రభుత్వంపై భారం ఉండదని ప్రాజెక్టు వేగంగా నిర్మాణంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
మూసీ ప్రాజెక్టు సుందరీకరణతో హైదరాబాద్‌కు సరికొత్త శోభ రానుంది.