ఎక్కడైనా చావుకు వెళ్ళినప్పుడు ఏ లీడర్ అయినా ఏం చేస్తారు..బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇస్తారు..ఆందోళన చెందవద్దని న్యాయం జరిగేలా చూస్తామని.. నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పార్టీ పరంగా పోరాడుతామని బాధిత కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా మాట్లాడుతారు.
వినుకొండలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్ రెడ్డి మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు. చేతికి వచ్చిన కొడుకును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న మృతుడి తల్లిని ఓదార్ఛాల్సిన జగన్ అక్కడ కూడా రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ కూటమి సర్కార్ ను బద్నాం చేసేందుకు జగన్ అధిక ప్రాధాన్యతనివ్వడం కనిపించింది.
కూటమి అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తా అన్నారు.. తల్లికి వందనం అన్నారంటూ.. చంద్రబాబు హామీలను గుర్తు చేయడం అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి వైఫల్యాలను గుర్తు చేసినట్టుగా పరామర్శలోనూ రాజకీయ అంశాలనే లేవనెత్తారు. జగన్ విధానం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పరామర్శకు వచ్చారా..? రాజకీయాలు చేసేందుకు వచ్చారా..? అని ఆశ్చర్యపోయారు.