జగన్ అన్న వస్తున్నాడు… ఓ పది లక్షలైనా ఇస్తాడని ఆశించిన రషీద్ ఫ్యామిలీకి నిరాశ మిగిలింది. ఓదార్పు అంటే బాధిత కుటుంబానికి ఎంతో కొంత అర్థిక సాయంచేసి భ రోసా ఇస్తారు. జగన్ గతంలో అదే చేశారు. కానీ తన పార్టీ కార్యకర్త అని గగ్గోలు పెట్టిన జగన్ చివరికి ఐదు పైసలు కూడా ఆ కుటుంబానికి సాయం చేయలేదు. అండగా ఉంటానని చెప్పి .. కావాల్సినంత రాజకీయం చేసుకుని వచ్చారు. ఆ కుటుంబ బాధను రాజకీయంగా వాడుకున్నారు కానీ.. ఆర్థిక సాయం చేయలేదు.
ఇదే విషయాన్ని బయట మీడియా ప్రతినిధి అడిగితే… ఫ్లో ను మిస్ చేస్తున్నారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత అయినా చెప్పారా అంటే అదీ చెప్పలేదు. ఏదైనా ఇస్తే కదా చెప్పడానికి . రషీద్ అనే వ్యక్తి వైసీపీ హార్డ్ కోర్ అభిమాని. చంపిన జిలానీ కూడా వైసీపీనే. ఇద్దరికీ గొడవలు అయ్యాయి. వైసీపీలో ఉండగానే ఇద్దరూ గంజాయికీ బానిసలు. మద్యం దుకాణంలో రషీద్ కు ఉద్యోగం ఇప్పించారు. వైసీపీ కార్యకర్తలు.. ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్న వారందరికీ ఇలాంటి ఉపాధి గత ఐదేళ్లలో దొరికింది. ఆ పేరుతో వాళ్లను అసాంఘిక శక్తులుగా మార్చుకున్నారు.
ఇప్పుడు ఆ ప్రతిఫలాలు కనిపిస్తూంటే.. వైసీపీకి రాజకీయ ఇంధనంగా మారుతున్నారు తప్ప… కనీస సాయం చేయడం లేదు. ఆ కుటుంబం పేద కుటుంబమే . ఇంటికి ఆదాయ దిక్కును కోల్పోయారు. పార్టీ తరపున అండగా ఉండటమంటే.. లాయర్ సుధాకర్ రెడ్డిని చూసుకోమని చెప్పడం కాదు. ముందు ఎంతో కొంత సాయం చేయాలి. అది మాత్రం చేయలేదు.