పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఒక్క బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించాయి. దీంతో కేసీఆర్ ఎందుకు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించలేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ముందు ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యేవారు.ఈసారి లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా..రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. వారినైనా పిలిచి.. కేంద్ర బడ్జెట్ పై ఏం మాట్లాడాలి.. రాష్ట్రానికి నిధుల విషయంలో ఎలా వ్యవహరించాలి అని దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఈసారి అయినా వస్తారా సార్?
ఇటీవల బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీ రాజ్యసభ పక్షంలో విలీనం కానుంది అనే ప్రచారం జరిగింది. నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ మినహా ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.