వైసీపీ అధినేత జగన్ మరోసారి సామాజిక న్యాయం చేశారు. తమ పార్టీకి మెజార్టీ ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని ఖరారు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేరు…కానీ మండలిలో అప్పిరెడ్డి అవుతారు. ఆయనకు ప్రోటోకాల్ లభిస్తుంది. అసెంబ్లీలో జగన్ రెడ్డి వైసీపీ ఫ్లోర్ లీడర్ కాబట్టి… మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఎవరికైనా చాన్స్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన కూడా చేయలేదు.
అప్పిరెడ్డికి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే కాదు… ఆయన నేర చరిత కూడా అదనపు అర్హత. గుంటూరు నగరంలో అడ్డమైన పనులు చేసే ముఠాకు లీడర్ గా ఆయనకు గుర్తింపు ఉంది. గతంలో రెండు హత్య కేసుల్లో నిందితుడు. ఎలాగోలా బయటపడ్డారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన కీలక సూత్రధారి. గుంటూరు నుంచి తన అనుచరులైన గంజాయి బ్యాచ్ ను పంపింది అప్పిరెడ్డే.
Also read : అదేం తిక్క.. ఇదేం లెక్క.. జగన్?
అప్పిరెడ్డిని ఎమ్మెల్సీని చేయడానికి గవర్నర్ ఇష్టపడలేదు. నామినేట్ చేయడానికి గవర్నర్ ఇష్టపడక ఫైల్ పక్కన పెట్టేయడంతో జగన్ వెళ్లి బతిమిలాడి ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఇలాంటి నేత వైసీపీ తరపున ప్రతిపక్ష నేత అవడంలో ఎలాంటి వింత లేదు. అది వైసీపీ బ్రాండ్.