తెలంగాణలో హైదరాబాద్ దేశంలోనే అతి ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నీడలో ఇతర నగరాలు ఎదగడం కష్టమే. కానీ.. వరంగల్ ఎదుగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా వరంగల్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం లభిస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీని రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు రెడీల చేసుకుంటోంది.
ఇప్పటికే వరంగల్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వంటి పనులు జరుగుతున్నాయి. మామునూరు ఎయిర్ పోర్ట్ ను పట్టాలెక్కించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ,వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పదిహేడు వందల కోట్ల రూపాయలతో అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి , ఇన్నర్ రింగ్ రోడ్ పనులు జోరుగాసాగుతున్నాయి.
Also Read : రూ.31 వేల కోట్లు రేవంత్ ఎలా సమీకరించారు ?
ట్రైసిటీ నగరంగా మారాలంటే పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యం. పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటైతే.. ఉపాధి పెరుగుతుంది. ఉపాధి ఎక్కువగా ఉన్న గరం అభఇవృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఐటీ పార్క్ ను ప్రారంభించారు. టైర్ టు నగరాల్లో యూనిట్లు పెట్టాలనుకునే ఐటీ కంపెనీలకు వరంగల్ ను ప్రాధాన్యంశంగా చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో 608 పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పారు. వరంగల్ రూరల్‌లో 323 ఏర్పాటయ్యాయి.
మెగాటెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో పలు దేశీయ, విదేశీ కంపెనీలు యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయి. తద్వారా ఈ టెక్స్టైల్ పార్క్‌లో లక్ష మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. కిటెక్స్ పరిశ్రమ ఉత్పత్తికి సిద్ధమయింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ టు వరంగల్ ప్రయాణాలు శరవేగంగా సాగేలా ప్రత్యేకమైన ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తే వరంగల్‌కు మరింత ఉజ్వలమైన భవిష్యత్ వస్తుందన్న నమ్మకంతో పరిశ్రమ వర్గాలున్నాయి.