ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని..ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఐదేళ్ళుగా తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు కోరగా అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. బడ్జెట్ కేటాయింపులో ఏపీకి శుభవార్త చెప్పారు.
బడ్జెట్ సమావేశాలకు ముందే పోలవరం, అమరావతి విషయంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని సహా కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీలో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్ లో మరిన్ని నిధులు ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు మంజూరు చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read : కాస్త వాళ్లకి ఎవరైనా చెప్పండ్రా.. అన్నయ్య చేసింది తప్పని!
అలాగే, పోలవరం ప్రాజెక్టును పూర్హి చేయడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఏపీకే కాదు.. దేశ ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకం అని వివరించారు. ఇక, హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని నోడ్ లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు.