తెలంగాణలో బడ్జెట్లో జీరో అంటూ బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించగానే కాంగ్రెస్ అందుకుంది. కాంగ్రెస్ కు సంస్థాగతంగా బడ్జెట్ ను వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ ముందుగా ప్రారంభించింది. అయితే ఆ పార్టీ నేతలు బీజేపీని కాకుండా కాంగ్రెస్ ను తిట్టడం ప్రారంభించారు. అది ఆ పార్టీ అనివార్యత. ఈ రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణకు నిజంగాఅసలు ఏమీ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. అంత కన్నా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మరొకటి ఉండదు.
కేంద్ర బడ్జెట్ అంటే… రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనలును ప్రాధాన్యతల వారీగా చేపట్టడం .. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులు. కేంద్రం దేశాన్ని పరిపాలిస్తుంది. అందులో రాష్ట్రాలు భాగం. కేంద్రం చేసే ఖర్చు రాష్ట్రాల్లోనే చేస్తుంది తప్ప మరోచోట కాదు. అంటే.. బడ్జెట్ లెక్క రాష్ట్రాలకు నిధులు కేటాయించడమే. తెలంగాణకు దండిగా పన్నుల్లో వాటా వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటా నిధులు వస్తాయి. గ్రాంట్లు వస్తాయి. ఇవన్నీ రాజ్యాంగ పరంగా ప్రతి రాష్ట్రానికి వచ్చేవి.
Also Read : రూ.31 వేల కోట్లు రేవంత్ ఎలా సమీకరించారు ?
కేంద్రం ప్రత్యేకంగా జాతీయ రహదారులతో పాటు పలు ప్రాజెక్టులు చేపడుతుంది. అలాంటివి అన్ని రాష్ట్రాలకూ అవకాశం ఉంటుంది. తెలంగాణలో కొన్ని వేల కిలోమీటర్ల జాతీయరహదారుల నిర్మాణం జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు అత్యధిక ప్రయోజనం కలిగే పారిశ్రామిక కారిడార్‌కు నిధులు కేటాయించారు. ఏపీకి వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పారు.. ఒక్క ఏపీకి కాదు.. దేశం మొత్తం మీద 150 జిల్లాలకు నిధులిస్తారు., అందులో తెలంగాణ జిల్లాలకూ నిధులిస్తారు.
రేవంత్ అడిగిన ప్రత్యేక సాయం మాత్రం కేంద్రం చేయలేదు. మూసి ప్రాజెక్టుకు డీపీఆర్ కూడా లేదు. ఎలా నిధులు కేటాయిస్తారు ?. ఐఐఎం ఎందుకు కేటాయించలేదో… తెలుసుకుంటే్… మరోసారి ప్రయత్నం చేయవచ్చు. కానీ రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతీయ హోదా కావాలంటున్న ప్రాజెక్టుల కోసం ఇంత వరకూ ప్రాపర్ గా దరఖాస్తు చేయలేదు. ఏమీ కేటాయించలేదని రాజకీయ విమర్శలు చేయడానికి పనికి వస్తాయి కానీ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా అన్యాయం జరగలేదు…కానీ ఏపీకి ఇచ్చారు కాబట్టి తమకు ఇవ్వలేదని చెప్పుకోవడానికి మాత్రం అవకాశం ఏర్పడింది.