రాజకీయాల్లో షర్మిల కంటే జగన్ చాలా సీనియర్. ఓసారి ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. అలాంటి జగన్ వేస్తోన్న రాజకీయ అడుగులు ఆయనకు కనీస రాజకీయ అనుభవం లేదన్న అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. కారణం షర్మిల. అవును.. జగన్ రాజకీయ అవగాహనారాహిత్యాన్ని షర్మిల భూతద్దంలో చూపిస్తున్నారు. అదే సమయంలో రాజకీయం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకో అనేలా ఆమె వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఢిల్లీకి వెళ్లి శాంతి భద్రతల పేరుతో జగన్ ధర్నాకు దిగారు. ఇప్పటికప్పుడు కొత్త సర్కార్ పై ఎదురుదాడి చేస్తే ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ ఉండదు. ఇప్పటికప్పుడు కొత్త ప్రభుత్వంపై అంతా ఈజీగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. కానీ, జగన్ ఐదేళ్ళు అధికారం లేకుండా ఉండటం ఎలా అని అప్పుడే మధనపడుతున్నట్టు కనిపిస్తున్నారు.
Also Read : జగన్ కు ఝలక్..ఢిల్లీలో ధర్నాకు ఆ ఎమ్మెల్సీలు దూరం!?
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి చేస్తోన్న కార్యక్రమం పూర్తిగా పార్టీ కార్యక్రమమే తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిరసన కాదని ప్రజలకు అర్థమైంది. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల చెబుతున్నారు. శాంతి భద్రతలపై ఢిల్లీలో ధర్నాకు సిద్దమైన జగన్.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నిజమే.. ఈ విషయంలో కూటమి సర్కార్ ను ప్రశ్నించేందుకు ఇదొక మంచి టాపిక్. కానీ, జగన్ ఈ సబ్జెక్ట్ ను వదిలేసి ఏమాత్రం ప్రజామోదితం లేని అంశంపై ధర్నాకు దిగారు. దీంతో రాజకీయ వ్యూహకర్తలు పక్కనలేకుంటే జగన్ కు ఏ అంశంపై రాజకీయం చేస్తే ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందో కూడా తెలియని రాజకీయ అజ్ఞాని అని షర్మిల తన నిర్ణయాల ద్వారా తెలియజేస్తున్నారు.