స్వరూపానంద మఠం పేరుతో జగన్ రెడ్డి దగ్గర లెక్కలేనన్ని భూములు రాయించుకున్నారు. భీమిలిలో 15 ఎకరాలు కేటాయించారు. వాటిని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కాదని ఆదాయంకోసం వాడుకుంటామని ప్రతిపాదన లు కూడా పెట్టారు. కొత్త వలస గ్రామం సర్వే 102-2 , 103 లలో భీమునికొండపై ఈ భూములు ఉన్నాయి. వేద విద్యార్థులే ఉండని పీఠానికి అన్ని ఎందుకన్న ప్రశ్న ప్రభుత్వానికి రాలేదు. ఈ భూములను వ్యాపార అవసరాలకు వాడతామని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ భూమి కి రెండు కోట్ల ప్రజాధనం పెట్టి రోడ్డు కూడా వేశారు.
ఇక చినముషిడివాడలో శారదా పీఠాన్ని విస్తరించేందుకు గెడ్డను కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత వాటిని క్రమబద్దీకరించుకున్నారు. శారదాపీఠం పేరుతో భూములు స్వాహా చేయడం ఒక్క చోట ఆగిపోలేదు. అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరోచోట.. ప్రకాశం జిల్లాలో ఇంకోచోట.. తిరుపతి, తిరుమలలో రెండు చోట్ల భూములను కేటాయించింది జగన్ ప్రభుత్వం. తెలంగాణలో కేసీఆర్ కూడా కోకాపేటలో రెండు ఎకరాలు రెండు రూపాయలకే కేటాయించారు. ఏపీలో శారదాపీఠం స్వాహా చేసిన భూముల వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు.
Also Read : తిరుమలలోనూ స్వరూపానంద దందా లెక్కలేనంత !
జగన్ హయాంలో రాజగురువుగా ఫీలయ్యారు స్వరూపానంద. ఆయనకు జడ్ ప్లస్ స్థాయిసెక్యూరిటీ ఉండేది. కాన్వాయ్ కూడా పోలీసులు ఏర్పాటు చేసేవారు. ఆయన సెక్యూరిటీ కోసం ఏడాదికి యాభై కోట్ల వరకూ ఖర్చయ్యేదని చెబుతారు. ఇప్పుడు అదంతా పీకేశారు. ఆయన మఠం దగ్గర పోలీస్ బందోబస్త్ కూడా తీసేశారు. కానీ స్వరూపానందకు మాత్రం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కొనసాగిస్తున్నారు. ఆయన మఠం వ్యవహారాల్లో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అధ్యాత్మిక కార్యక్రమాలు.. సేవలు .. చేసిందే లేదు. ఈ మొత్తం వ్యవహారాలను త్వరలోనే బయట పెట్టే అవకాశం ఉంది.