జగన్ ఢిల్లీ ధర్నా వెనుక అసలు స్క్రిప్ట్, స్కెచ్ ధర్నా పూర్తయ్యే సరికి కానీ అందరికీ అర్థం కాలేదు. ఇండి కూటమిలో చేరేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకునేందుకు జగన్ వచ్చారు. ఇండీ కూటమిలో పార్టీలన్నీ వచ్చి జగన్ కు వరుసగా సంఘిభావం తెలిపాయి. మామూలుగా జగన్ బీజేపీకి స్పీకర్ ఎన్నికలోనూ మద్దతు పలికారు. గతంలో ఆ పార్టీలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా జగన్ నోరు విప్పలేదు. బీజేపీకే వంత పాడారు. సమాజ్ వాదీ తృణమూల్, శివసేన వంటి పార్టీలపై గతంలో విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను కూడా వదల్లేదు. ఇప్పుడు జగన్ ధర్నాకు వరుసగా వచ్చి సంఘిభావం తెలిపారు.
జగన్ తాను ఇండీ కూటమి వైపు మారబోతున్నానని సంకేతాలు పంపేందుకే స్క్రిప్ట్ ప్రకారం ఈ ధర్నా నిర్వహించారు. ఏపీలో ఏమీ జరగకపోయినా ఏదో అపోయిందని అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సమావేశం పెట్టడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఇప్పుడు స్పష్టమయింది. అయితే ఇప్పుడు జగన్ తనకు మద్దతు తెలిపిన వారినందర్నీ చూపించి.. బీజేపీని బ్లాక్ మెయిల్ చేసి.. తనపై కేసులు.. విచారణలు ఇంకా ఆలస్యమయ్యేలా చేసుకుంటారా లేకపోతే నిజంగానే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తారా అన్నది అసలు సందేహం.
Also read : జగన్ రాజకీయ అజ్ఞాని..షర్మిల అలా తేల్చేస్తున్నారా?
మద్దతు పలికేందుకు కాంగ్రెస్ నేతలు రాలేదు. కానీ జైరాం రమేష్ ముందు నుంచి వైసీపీకి సపోర్టుగా ఉన్నారు. వైఎస్ షర్మిల కు ఇబ్బంది అవుతుందన్న కారణంగానే కాంగ్రెస్ నేతలు ఎవరూ రాలేదని తెలుస్తోంది. జగన్ ఇండి కూటమికి దగ్గరవుతన్నారన్న క్లారిటీ రావడంతోనే షర్మిల దూకుడు పెంచుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తూ హైకమాండ్ ముందుకెళ్లుండా చేస్తున్నారు. మొత్తంగా జగన్.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి మళ్లీ అధికారం రాదని ఫిక్సయిపోయి.. వచ్చే ఇబ్బందులు ఎదుర్కొని సానుభూతి అయినాపెంచుకోవచ్చని.. ఇండి కూటమి వైపు మారిపోతున్నట్లుగా ఢిల్లీ వర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి. ఇక బీజేపీ ఏం చేయబోతోందన్నది ఇప్పుడు కీలకం.