కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల వరద పారుతోంది. విభజన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన ఏపీని ఆదుకునేందుకు తొలిసారిగా భారీగా నిధులు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గత ఐదు సంవత్సరాల్లో విస్మరించిన ప్రాజెక్టులకు తోడు కొత్త ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యేలా కేంద్ర బడ్జెట్ లో నిధులు రాగా… తాజాగా రైల్వే బడ్జెట్ లోనూ రాష్ట్రానికి నిధులు భారీగానే దక్కాయి.
రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ల అభివృద్దికి 2,047కోట్లు కేటాయించింది. దీంతో అమరావతిని అనుసంధానిస్తూ 56కి.మీ మేర లైన్ల నిర్మాణం, అభివృద్ది జరగబోతుంది. ఏపీకి మొత్తంగా 9,151కోట్లు కేటాయించారు.
Also Read : కూటమి కాదు.. షర్మిలే జగన్ టార్గెట్..!?
ఇక విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రైల్వే జోన్ కావాలంటే విశాఖలో రైల్వేకు భూములు కేటాయించాలి. కానీ గత ప్రభుత్వం భూమిని ఇవ్వలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తామని చెప్పిన భూమి కూడా రిజర్వాయర్ పరిధిలో ఉన్నందున… బ్యాక్ వాటర్ సమస్య వస్తుందని తెలిసి వద్దన్నామని, ఆ తర్వాత ప్రత్యామ్నాయ భూమి ఇవ్వలేదన్నారు.
తాజా కేటాయింపులతో అమరావతి నిర్మాణంతో పాటు ఏపీలో అభివృద్ది పరుగులు పెట్టేందుకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది.