ఢిల్లీ ధర్నాతో వైసీపీ ఇరుక్కుపోయింది. ఇప్పుడు బీజేపీ దగ్గరకు వెళ్లలేదు. కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేదు. బీజేపీ దగ్గరకు వెళ్తే అటు కాంగ్రెస్ ఇక జన్మలో నమ్మదు. ఎందుకంటే.. కష్టాల్లో ఉన్నాడని తమ కూటమి సభ్యులందర్నీ జగన్ కు మద్దతుగా పంపించింది. కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. ఆ బలం కాంగ్రెస్ నుంచే లాక్కున్నారు. అయినా ప్రస్తుత రాజకీయాల కారణంగా జగన్ ను దగ్గరకు తీయాలనుకుంటోంది.
Read Also: జగన్ ఢిల్లీ ధర్నా అసలు స్క్రిప్ట్ ఇదీ !
జగన్కు ఇప్పుడు జాతీయస్థాయిలో మద్దతు అవసరం. రాబోయే రోజుల్లో ఆయన అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కొత్తగా వివేకా హత్య కేసు కూడా చుట్టుకునే అవాకాశం ఉంది. ఇక అధికారం ఉందని విచ్చలవిడిగా నాకేసిన జనం సంపద వ్యవహారంలో సాక్ష్యాలు కళ్లెదురుగా ఉన్నాయి. లిక్కర్ స్కాంపై ఇప్పటికీ సీఐడీ విచారణకు ఆదేశించారు. డబ్బుల లొసుగులు బయట పెట్టి ఈడీకి సమాచారం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డి నుంచి మొత్తం కక్కించారు. ఇక ఇసుక వ్యవహారం నేరుగా సుప్రీంకోర్టు వద్దనే ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం చేయడానికి కావాల్సినన్ని ఆయుధాలు ఎన్డీఏ కూటమి వద్ద ఉన్నాయి. అందుకే తనపై మళ్లీ కేసులు పెడితే జాతీయ స్థాయిలో వేధింపులు అని ప్రచారం చేసుకోవడానికి కొన్నిపార్టీల మద్దతు అవసరం అందుకే జగన్ ఈ స్టెప్ వేశారు . ఇంత చేసిన తర్వాత కూడా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లుల విషయంలో బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తే .. జగన్ కు క్యారెక్టర్ లేనట్లుగానే భావించి అన్ని పార్టీలు వదిలేస్తాయి.