ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత అక్కడ జరిగిన నేరాల గురించి.. డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసిన తర్వాత ఏపీలో అందరూ అదేమైనా పెద్ద స్కామా అనుకుకున్నారు. ఎందుకంటే ఏపీలో జరిగింది అంద కంటే బహిరంగ దోపిడీ. లక్ష కోట్లు నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి. ఈ స్కాంలో ఒకటి నుంచి వంద దాకా మొత్తం ఓ మాఫియాదే రాజ్యం. విచారణ ప్రారంభించగానే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి.
మద్యం వ్యాపారం మొత్తం గత ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోనే ఉంది. అమ్మేది ప్రభుత్వ దుకాణం పేరు మీద. కానీ అందులో పని చేసే మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ తయారీ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉండేది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అన్ని విభాగాల్లో వైసీపీ నేతలు దూరిపోయి ప్రైవేటు డిస్టిలరీల్లో మద్యం సేకరణ నుంచి… లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల కమిషన్లకు తెరతీశారు.
Also Read: కలలోకి వస్తున్న రెడ్ బుక్ !
వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరూపేరూ లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్లు పెట్టి మరీ అమ్మించారు. వాటిలో విష రసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిపారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే ఉన్నారు. నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డుల్లోకి వెళ్లకుండా చూసుకున్నారు. రఘురామ స్వయంగా ల్యాబుల్లో మద్యాన్ని టెస్టులు చేయించి రిపోర్టులు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా .. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.
ఇప్పటికే కావాల్సినంత సమాచారాన్ని సేకరించేశారు. సీఐడీ అడుగు పెట్టి.. చర్యలు తీసుకోవడమే మిగిలింది. అసలేం జరిగిందో ప్రజల ముందు పెడితే.. అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.