గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో కేసీఆర్ ను మించిన వ్యూహకర్త ఎవరూ ఉండరన్నారు..కేసీఆర్ ను డీకొట్టేందుకు రేవంత్ ప్రయత్నాలు పార్టీకి కొంత మేలు చేస్తాయి తప్పా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్నారు..ఫలితాలు వచ్చాక నోరెళ్ళబెట్టడం వారి వంతైంది..అయినప్పటికీ, అధికార పక్షం కన్నా కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్ అన్న వాదనలూ వినిపించాయి..తన వ్యూహాలతో రేవంత్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తారని..అసెంబ్లీలో అయితే రేవంత్ ను ఓ రేంజ్ లో ఎండగడుతారని అంచనా వేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇక కాంగ్రెస్ సర్కార్ పై సమరమేనని యుద్ద ప్రకటనలు చేసిన కేసీఆర్ కు అస్త్రాలు లేకుండా చేసేశారు రేవంత్.
బీఆర్ఎస్ కు పదేళ్లుగా ప్రధానంగా అండగా నిలిచింది రైతాంగమే. ఇప్పుడు అదే వర్గాన్ని బీఆర్ఎస్ నుంచి తప్పించేలా రేవంత్ సర్కార్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుణమాఫీపై వెనక్కి రేవంత్.. బడ్జెట్ లోనూ రైతాంగానికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. ఏకంగా వ్యవసాయానికి 25 శాతం బడ్జెట్ కేటాయించారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. దీని ద్వారా రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుంది అని బీఆర్ఎస్ చేస్తోన్న వాదనను తుత్తినియలు చేయడమే కాకుండా..బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్సే రైతాంగానికి మేలు చేస్తుందన్న మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది రేవంత్ ఎత్తుగడగా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read : అయినా.. కేసీఆర్ దొరికిపోయారోచ్!
రాష్ట్ర బడ్జెట్ ను రైతు వ్యతిరేకి బడ్జెట్ అని విమర్శలు చేసిన కేసీఆర్ .. శనివారం అసెంబ్లీకి హాజరైతే, ఆయన రేవంత్ సర్కార్ ను ఎలా ఎదుర్కోబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రైతు భరోసా నిధులనే రుణమాఫీకి మళ్ళించారని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించినా దాని నుంచి బీఆర్ఎస్ కు పెద్ద ఒరిగేదేమీ ఉండదు..ప్రస్తుతం రైతులంతా రుణమాఫీతో సంబరాల్లో ఉన్నారు. కానీ, వ్యవసాయ సంబంధిత సమస్యలతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు కేసీఆర్. రేవంత్ వాదన ఎలా ఉన్నా.. వ్యూహాత్మకంగానే రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగాన్ని రేవంత్ తన వ్యూహాలతో పేలవంగా మార్చబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.