అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది చెందిన సంస్థలు… పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలను ఆయన పిలుస్తున్నరు. అబుదాబి కేంద్రంగా పని చేస్తూ ఏఐలో అద్భుతాలు చేయడానికి రెడీ అవుతున్న G42 ఇండియా సీఈవో మనుకుమార్ జైన్.. నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పాజిటివ్ వర్డ్స్ తో వెల్లడించారు.
మనుకుమార్ జైన్ తో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ కూడా వెల్లడించారు. అమరావతిలో G42 భారీ పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే G42 సబ్సిడరీ అయిన M42 కంపెనీ అమరావతి హెల్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయింది. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తో ఇప్పటికే చర్చలు జరిపారు. అమారవతిలో మొత్తం తొమ్మిది నగరాలను ప్రకటించారు. వాటిలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తుంది. మిగతా అంతా ప్రవేటు సంస్థలే పెట్టుబడులు పెడతాయి.
Also Read : లోకేష్‌ను కలిసిన నాస్కాం టీం
అమరావతికి అనుకూలంగా కేంద్రం పెద్ద ఎత్తున నిధుల సాయం ప్రకటించడంతో ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవని అంచనా వేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. గతం లాంటి పరిస్థితులు ఇక ఏపీలో రావన్న భరోసా పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తున్నారు. అందుకే పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.