ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా… వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం లేకుండానే ఇంటింటికీ ఫించన్లు చేరవేశామని చెప్పుకుంది. ఇప్పుడు ఆగస్టు నెల సమీపిస్తోంది. దీంతో వచ్చే నెల కూడా వారితోనే ఫించన్లు పంపిణీ చేస్తారా లేక వాలంటీర్లకు ఆ పని అప్పగిస్తారా..? అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
జులై మాదిరిగానే ఆగస్టులోనూ సచివాలయ సిబ్బందితోనే ఫించన్లు పంపిణీ చేస్తే.. వాలంటీర్ సేవలను సర్కార్ ఎలా వాడుకుంటుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. వాలాంటీర్ల సేవలను కొనసాగిస్తామని కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. పైగా వారికి వైసీపీ నెలకు ఐదు వేల వేతనం ఇస్తే తాము రెట్టింపు వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు చంద్రబాబు.
Also Read : జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?
దాంతో ఎన్నికల్లో కొంతమంది వాలంటీర్లు కూటమి సర్కార్ ను బలపర్చారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని తేల్చి చెప్పారు. కానీ వారికి ఇంతవరకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. ఈ కారణంగా ఏపీలో అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా..ఎత్తివేస్తారా.? అని వాలంటీర్లలో అనుమానాలు నెలకొన్నాయి. రెండు రోజుల్లో ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.