మదనపల్లి సబ్ డివిజన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ అక్రమాలపై మరో పది రోజుల పాటు సమయం ఇచ్చినా వచ్చి ఫిర్యాదు చేసేంత భారీ స్థాయిలో వచ్చిన స్పందన చూసి… రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోతోంది. ఏదో సినిమాల్లో చూపించినట్లుగా భూములన్నీ మావే అన్నట్లుగా వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాలకేయుల్నిపెంచి పోషించి దోచుకున్న వైనం బయటపడింది. ఈ వ్యవహారాలు.. బాధితుల ఆర్తనాలు చూసిన ఎవరికైనా.,.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గుర్తుకు రావడం ఖాయం.
పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో అందర్నీ గుప్పిట పట్టేశారు. చివరకు న్యాయవ్యవస్థనూ వదల్లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని లాక్కోవడం ప్రారంభించారు. నేర మనస్థత్వం ఉన్న .. దోపిడీకి సహకరించే ప్రతి ఒక్క నేతనూ ప్రోత్సహించారు. వారికి తృణమో పణమో ఇచ్చి..మిగతా అంతాతన కుటుంబం పై రాసుకోవడం ప్రారంభించారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఫ్రీహోల్డ్ భూముల పేరుతో చేసిన దందా ఇప్పుడు బయటకు వస్తోంది.
మదనపల్లి సబ్ డివిజిన్లో ఇప్పుడు కనీసం వంద మంది వైసీపీ నేతలు పత్తా లేరు. పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలియడంతో… వారంతా తమ ఆస్తి పత్రాలు.. తాము చేసిన దందాల పేపర్లు పట్టుకుని పరారయ్యారు. కానీ వారి బాధితులు మాత్రం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అందరి భూముల్ని రాయించుకుని ఏం చేసుకుంటారో కానీ.. పెద్దిరెడ్డి పాపం పండిందన్న మాట మాత్రం చిత్తూరు జిల్లాలో ఘనంగా వినిపిస్తోంది.